ఆ దేశంలో కరోనా మళ్ళీ విజృంభణ...

ఆ దేశంలో కరోనా మళ్ళీ విజృంభణ...

చైనా తరువాత కరోనా వైరస్ యూరప్ దేశాల్లో వ్యాపించిన సంగతి తెలిసిందే.  ఇటలీ, స్పెయిన్, ఫ్రాన్స్, బ్రిటన్ వంటి దేశాల్లో కరోనా మహమ్మారి విలయతాండవం సృష్టించింది.  ఇప్పుడిప్పుడే యూరప్ వైరస్ నుంచి బయటపడుతున్నది.  అయితే, ఇప్పుడు ఫ్రాన్స్ ను మళ్ళీ కరోనా భయపెడుతున్నది.  ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్, మార్సెయిల్ నగరాల్లో కరోనా కేసులు భారీ సంఖ్యలో నమోదవుతున్నాయి.  దీంతో ఈ రెండు నగరాలను ప్రభుత్వం కరోనా హై రిస్క్ జోన్ గా ప్రకటించింది.  ఈ రెండు నగరాల్లో ఆంక్షలను తిరిగి కఠినంగా అమలు చేసేందుకు సిద్ధం అవుతున్నది.  రద్దీ గా ఉండే ప్రాంతాలలో ప్రజా రవాణాను తగ్గించడంతో పాటుగా బార్లు, రెస్టారెంట్లు తిరిగి క్లోజ్ చేసేలా చర్యలు తీసుకోబోతున్నది ప్రభుత్వం.  గత రెండు రోజులుగా ఫ్రాన్స్ లో రోజుకు 2500లకు పైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి.