రేపటి నుంచి ఉచితంగా వ్యాధి నిర్ధారణ ప‌రీక్షలు

రేపటి నుంచి ఉచితంగా వ్యాధి నిర్ధారణ ప‌రీక్షలు

తెలంగాణ ప్రభుత్వం ముందుగా ప్రకటించినట్టుగా ఉచిత వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించేందుకు సిద్ధమైంది... శ‌ర‌వేగంగా అభివృద్ధి చెందుతున్న వైద్యారోగ్యశాఖలో మ‌రో మైలు రాయిగా నిలువ‌నుంది తెలంగాణ డ‌యాగ్నోస్టిక్స్‌.... రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజ‌ల‌కు ఉచితంగా వ్యాధి నిర్ధార‌ణ ప‌రీక్షలను నిర్వహించనున్నారు. రేపు ఐపీఎంలో మంత్రులు కేటీఆర్, లక్ష్మారెడ్డి ఈ వ్యాధి నిర్ధారణ పరీక్షలను ప్రారంభించనున్నారు. హైద‌రాబాద్‌లోని ఐపీఎం ఆవ‌ర‌ణ‌లో గ‌ల డ‌యాగ్నోస్టిక్ సెంట‌ర్‌ని మంత్రులు కేటీఆర్, ల‌క్ష్మారెడ్డిలు శ‌నివారం ప్రారంభించనున్నారు.