హెల్త్ వాల్ట్ గురించి మీకు తెలుసా?

హెల్త్ వాల్ట్ గురించి మీకు తెలుసా?

ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్.. ప్రవేశపెట్టిన హెల్త్ వాల్ట్ సర్వీసులో అనేక సదుపాయాలున్నాయి. కస్టమర్ల హెల్త్ ప్రొఫైల్, ఇతర రికార్డులను ఆన్ లైన్ లో ఉచితంగా భద్రపరుచుకోవచ్చు. హెల్త్ వాల్ట్ (www.healthvault.com) పేరుతో తీసుకొచ్చిన ఈ వెబ్ సైట్ లోకి మైక్రోసాఫ్ట్ అకౌంట్ తో నేరుగా ఎంటర్ కావచ్చు. మైక్రోసాఫ్ట్ అకౌంట్ లేనివారు ఇందులోనే ఐడీ క్రియేట్ చేసుకోవచ్చు. 

బరువు, హైట్ వంటి బేసిక్ హెల్త్ ప్రొఫైల్ తో పాటు ఇతరత్రా సీరియస్ రిపోర్టులు కూడా ఎప్పుడైనా, ఎక్కడైనా అందుబాటులో ఉండేలా హెల్త్ వాల్ట్ లో అప్ లోడ్ చేసుకొని భద్రపరచుకోవచ్చు. స్కాన్డ్ కాపీలు, పీడీఎఫ్ ఫైల్స్ ను, ఇంపార్టెంట్ నెంబర్స్, వెబ్ సైట్స్ ఇందులో దాచుకోవచ్చు. డాక్టర్ల నుంచి హెల్త్ రిపోర్టును ఎప్పటికప్పుడు తీసుకునే వెసులుబాటు కూడా ఇందులో ఇచ్చారు. ఇప్పటికే  హెల్త్ యాప్స్ మెయింటెయిన్ చేస్తున్నా.. ఇది యాక్సెస్ అవుతుంది. ఫిట్ బిట్, మై ఫిట్నెస్ కంపేనియన్, ఎంహెచ్ఆర్ ఇండియా, గెట్ ఫిట్ రోడ్ ట్రిప్ వంటి పలు యాప్స్ కు దీని యాక్సెస్ ఉంటుంది. 

సో హెల్త్ కు సంబంధించిన అన్ని రికార్డులు, అపాయింట్ మెంట్లను ఒకే ప్లాట్ ఫామ్ ద్వారా పొందవచ్చన్నమాట. అంతేకాదు.. ఒకే అకౌంట్లో కుటుంబ సభ్యుల హెల్త్ ఫైల్స్ ను కూడా సెపరేట్ గా యాడ్ చేసుకోవచ్చు.