విద్యార్థులకు గుడ్ న్యూస్..ఫ్రీ గా స్మార్ట్ ఫోన్లు.!

విద్యార్థులకు గుడ్ న్యూస్..ఫ్రీ గా స్మార్ట్ ఫోన్లు.!

కరోనా మహమ్మారి కారణంగా పాఠశాలలు మూసివేయాల్సి వచ్చింది. వైరస్ ప్రభావం చిన్న పిల్లలపై మరియు ముసలి వాళ్లపై ఎక్కువ ఉంటుందనే కారణంగా ఇప్పట్లో స్కూల్స్ తెరిచే ఆలోచనలో ప్రభుత్వాలు లేనట్టు కనిపిస్తుంది. ఇక తాజాగా ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సాంఘిక సంక్షేమ గురుకులాల్లో విద్యనభ్యసిస్తున్న 9వ తరగతి నుండి ఇంటర్ విద్యార్థులకు స్మార్ట్ ఫోన్లు అందజేయాలని నిర్ణయం తీసుకుంది. లాక్ డౌన్ నేపత్యంలో గురుకుల విద్యార్థుల సమస్యలు పరిష్కరించటానికి శుక్రవారం సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపె విశ్వరూప్ ఆధ్వర్యంలో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సాంఘిక సంక్షేమ శాఖ పరిధిలో మొత్తం 60వేల మంది విద్యార్థులు చదువుతుండగా వారిలో 30నుండి 40శాతం మందికి మాత్రమే స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. కాగా ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తే మిగతా విద్యార్థులకు ఇబ్బంది కలుగుతుందనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. కాగా విద్యార్థులకు 5వేల నుండి 6వేల రూపాయల వరకు విలువ గల స్మార్ట్ ఫోన్లు అందించాలని నిర్ణయించారు.