రైల్వే ప్రయాణీకులకు ఆ కార్డ్ తో ఆఫర్లే ఆఫర్లు 

రైల్వే ప్రయాణీకులకు ఆ కార్డ్ తో ఆఫర్లే ఆఫర్లు 

రైల్వే ప్రయాణీకులకు ఇక ఆఫర్లే ఆఫర్లు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా , ఐ.ఆర్.సి.టి.సి. సంయుక్తంగా ప్లాటినమ్ కార్డ్ ను అందించనున్నాయి. ఈ కోబ్రాండెడ్ ప్లాటినమ్ కార్డుతో రైల్వేలో ప్రయాణించే వారికి బోలెడన్ని ఆఫర్లు అందించనున్నారు. అయితే.. వీటికి కొన్ని నిబందనలు పెట్టారు రైల్వే,ఎస్బీఐ అధికారులు. ఇది కేవలం క్రెడిట్ కార్డుగానే పనిచేస్తుంది. ఈ ప్లాటినమ్ కార్డు కావల్సిన వారు రూ.500 చెల్లించాల్సి ఉంది. దీనికి వార్షిక ఫీజు రూ.300. 

ఐఆర్సీటీసీ,ఎస్బీఐ  ప్లాటినమ్ కార్డుతో ఐఆర్సీటీసీ వెబ్ ద్వారా ఏసీ1,ఏసీ2, ఏసీ3,ఏసీ సీసీ టికెట్లు కొంటే ..వారికి 10% వరకు విలువచేసే రివార్డ్ పాయింట్స్ ఇస్తారు. ఒక రివార్డ్ పాయింట్ ఒక రూపాయితో సమానం అని అధికారులు తెలిపారు. కార్డ్ హోల్డర్స్ ఈ పాయింట్స్ తో రైల్వే టికెట్లు కొనవచ్చు. వినియోగదారులు ఐఆర్సీటీసీ ద్వారా రైల్వే టెకెట్లపై 1.8 శాతం  ఛార్జీలు ఆదా చేసుకోవచ్చు అని అధికారులు తెలిపారు. ఈ కార్డు హోల్డర్లు ఐఆర్సీటీసీ  ఎయిర్ లైన్ టికెట్లు కూడా తక్కువ ధరలకే పొందవచ్చు. ఈ కార్డుతో అన్ని పెట్రోల్ బంకుల్లో బోనస్ పాయింట్లు పొందవచ్చు.