మే 1 నుంచి ఆ రాష్ట్రంలో ఫ్రీ వ్యాక్సినేషన్... 

మే 1 నుంచి ఆ రాష్ట్రంలో ఫ్రీ వ్యాక్సినేషన్... 

దేశంలో కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతోంది.  కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేశారు.  మే 1 నుంచి దేశంలో 18 ఏళ్ళు నిండిన వారికి వ్యాక్సిన్ అందించేందుకు కేంద్రం అంగీకారం తెలిపింది.  50 శాతం టీకాలను ఉత్పత్తి దారులు బహిరంగ మార్కెట్లో అమ్ముకునే వెసులుబాటు కలిపించింది.  దీంతో రాష్ట్రాలు పెద్ద ఎత్తున ఉత్పత్తి దారుల నుంచి వ్యాక్సిన్ కొనుగోలు చేసేందుకు సిద్ధం అవుతున్నాయి.  అస్సాం భారత్ బయోటెక్ నుంచి కోటి వ్యాక్సిన్లు కొనుగోలు చేసేందుకు సిద్ధం అయ్యింది.  కొవాగ్జిన్ వ్యాక్సిన్ ను కొనుగోలు చేసి రాష్ట్రంలోని అందరికి వ్యాక్సిన్ అందించాలని నిర్ణయం తీసుకుంది.