ఫ్రైడే స్టార్ పిక్.. వైరల్

ఫ్రైడే స్టార్ పిక్.. వైరల్

కొన్ని కాంబినేషన్లు చాలా క్రేజీగా ఉంటాయి. అలాంటి క్రేజీ కాంబినేషన్ ఎవరో తెలుసా.. ఎవరో కాదు..ప్రియాంక చోప్రా.. ఏఆర్ రెహమాన్.  ప్రియాంక చోప్రా.. ఏఆర్ రెహమాన్ లు ఏ సినిమాకు కలిసి పనిచేయలేదు.  అయినప్పటికీ ఈ ఇద్దరికీ మంచి క్రేజ్ ఉంది.  ఇటీవలే ప్రియాంక చోప్రా.. రెహమాన్ ను న్యూయార్క్ లోని జేబియల్ స్టూడియోస్ లో కలిసింది. ఆ సమయంలో ఈ అమ్మడు రెహ్మాన్ తో కలిసి సెల్ఫీ దిగింది.  ఆ సెల్ఫీని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. జీనియస్ తో పీసీ అని టాగ్ చేసింది.  

ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నది.  రెండు ఆస్కార్ అవార్డులు గెలుచుకున్న రెహమాన్.. హాకీ వరల్డ్ కప్ థీమ్ సాంగ్ కు మ్యూజిక్ అందించాడు.  ఆసియాలో అత్యంత భారీ బడ్జెట్ సినిమా రోబో 2పాయింట్ ఓ కు సంగీతం అందిస్తున్నాడు రెహమాన్.