కొత్త జంటకు స్నేహితులు గిఫ్ట్... ఓపెన్ చేసి చూస్తే... 

కొత్త జంటకు స్నేహితులు గిఫ్ట్... ఓపెన్ చేసి చూస్తే... 

ఇండియాలో పెళ్లిళ్లు ఎంత ఆర్భాటంగా చేస్తారో చెప్పక్కర్లేదు.  అంగరంగ వైభోగంగా వేడుకను నిర్వహిస్తారు.  బంధువులు, స్నేహితులు వివిధ కానుకలు తీసుకొచ్చి నూతన వధూవరులకు అందజేస్తారు.  ఆశీర్వదిస్తారు.  పెళ్లి అంటే ఇంచుమించుగా ఇలానే జరుగుతుంది.  ఇటీవలే కర్ణాటక రాజధాని బెంగళూరులో ఓ జంట వివాహం చేసుకుంది. 

బంధువులు, మిత్రులు అందరూ హాజరయ్యారు.  కొత్త జంట స్నేహితులు కొందరు ఓ రెండు గిఫ్ట్ ప్యాక్ లు అందజేశారు.  స్నేహితులు ఏం గిఫ్ట్ ఇచ్చారో చూద్దామని అక్కడే గిఫ్ట్ ప్యాక్ ను ఓపెన్ చేసింది కొత్త జంట.. ఆ గిఫ్ట్ లో ఉన్న వస్తువులను చూసి షాక్ అయ్యింది.  అవేంటో కాదు... ఉల్లిపాయలు.  గత కొన్ని రోజులుగా దేశంలో ఉల్లి ధరలు మండిపోతున్నాయి.  దేశంలో ఉల్లి రూ. 150 నుంచి రూ. 200 వరకు ఉంటోంది.  దీంతో స్నేహితులు రెండు కేజీల ఉల్లిని కొనుగోలు చేసి రెండు గిఫ్ట్ ప్యాక్ లో అందంగా ప్యాక్ చేసి వధూవరులకు అందజేశారు.  ఈ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.