ఈశా అంబానీ పెళ్లిలో రాజకీయ ప్రముఖులు

ఈశా అంబానీ పెళ్లిలో రాజకీయ ప్రముఖులు

దేశంలోనే అతిపెద్ద కుబేరుడు, ప్రముఖ పారిశ్రామిక వేత్త ముకేశ్‌ అంబానీ ఇంట భారతదేశంలోనే అతి ఖరీదైన పెళ్లి జరుగుతుంది. ముంబైలోని అంబానీల సొంత ఇంద్ర భవనం ఆంటిల్లాలో వివాహం జరగనుంది. రాజకీయ, సినీ ప్రముఖులు ఈ వివాహానికి హాజరవుతున్నారు. బిల్డింగ్‌పై ఓపెన్‌ టాప్‌ ప్లేస్‌లో ఏర్పాటు చేసిన వేదికపై వివాహ వేడుక జరగనుంది. ఈ వివాహ వేడుకకు దగ్గరి బంధువులతో పాటు దేశంలోని అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులు, బడా కార్పొరేట్‌ కంపెనీల సీఈవోలు, ఇతర వీవీఐపీలు వస్తున్నారు. ఇప్పటికే వివాహ వేదికకు మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ, అమెరికా మాజీ విదేశాంగ కార్యదర్శి హిల్లరీ క్లింటన్‌, కేంద్ర హోమ్ మంత్రి రాజ్ నాథ్ సింగ్, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ తదితరులు హాజరయ్యారు. ముకేశ్‌, అనిల్‌ అంబానీలు దగ్గరుండి అతిథులను ఆహ్వానిస్తున్నారు. ముకేశ్ పెద్ద కుమారుడు ఆకాశ్‌-శ్లోకా మెహతా, చిన్న కుమారుడు అనంత్ అతిథి మర్యాదలు చూసుకుంటున్నారు.