వైరల్ అవుతున్న కోడిగుడ్డు నూడిల్స్... అరటిపండు 

వైరల్ అవుతున్న కోడిగుడ్డు నూడిల్స్... అరటిపండు 

ఫాస్ట్ ఫుడ్ అందుబాటులోకి వచ్చిన తరువాత ఎక్కువ మంది ఇష్టపడే ఫుడ్ నూడిల్స్.  దేశం ప్రాంతంతో తేడా లేకుండా నూడిల్స్ ను లాగించేస్తుంటారు. ఇక నాన్ వెజ్ ను ఇష్టపడే వ్యక్తులు కోడిగుడ్డుతో చేసిన నూడిల్స్ కు లైక్ కొడుతుంటారు.  మామూలు ఉష్ణోగ్రతల్లో నూడిల్స్ ను చేసుకొని వేడివేడిగా తినెయ్యొచ్చు.  అదే మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రతల్లో నూడిల్స్ ను తయారు చేసుకొని బయటకు తీసుకొచ్చి తిందామని ప్రయత్నిస్తే గడ్డగట్టిపోతాయి.  అందులో ఎలాంటి సందేహం అవసరం లేదు.  ప్రపంచంలో అత్యంత తక్కువ ఉష్ణోగ్రతలు సైబీరియా ప్రాంతంలోనే నమోదవుతుంటాయి.  అలాంటి సైబీరియాలోని ఓ ప్రాంతంలో మైనస్ 49 డిగ్రీల సెల్సియస్ వద్ద నూడిల్స్ ను బయటకు తీసుకొచ్చారు.  ఇంకేముంది క్షణాల్లో గడ్డగట్టిపోయింది.  నూడిల్స్ మాత్రమే కాదు, అటు కోడిగుడ్డు కూడా గడ్డగట్టిపోయింది.  బాగా పండిన అరటిపండును బయటకు తీసుకొచ్చి కొంతసేపు ఉంచితే చాలు.  అది గట్టిగా మారిపోతుంది.  ఆ అరటిపండుతో ఇంట్లో మేకులు కూడా కొట్టుకోవచ్చు.