ఏ పండ్లలో ఎంత చక్కెర ?

ఏ పండ్లలో ఎంత చక్కెర ?

మామిడి, యాపిల్‌,  నారింజ, సపోటా, అరటి, స్టాబెర్రీ... ఇలా ఏ పండును తీసుకున్నా ఆరోగ్యకరమే. అన్నింట్లోనూ పోషకాలు పుష్కలంగా ఉంటాయి. కానీ.. మధుమేహం తదితర సమస్యలతో బాధపడుతున్న వారు ఏ పండ్లు తినొచ్చు? చక్కెర స్థాయి ఏ పండ్లలో ఎంతుంటుంది? ఆరోగ్యం కోసం ఎవరు ఏ పండైనా తినొచ్చా? ఇటువంటి విషయాల్లో ప్రతిఒక్కరూ తికమక పడుతుంటారు. ఏ పండ్లలో ఎంత శాతం చక్కెర ఉందో తెలుసుకుందాం..

 

 

 

యాపిల్‌.. 
రోజుకో యాపిల్ తింటే డాక్టర్ అవసరముండదని చెబుతుంటారు. అవును అది నిజమే. యాపిల్ గుజ్జులో ఉండే పెక్టిన్ అనే సాల్యుబుల్ ఫైబర్ పదార్థం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఫైబర్‌ ఎక్కువగా ఉంటుంది. 100 మిల్లీ లీటర్ల యాపిల్‌ జ్యూస్‌లో 9.6 గ్రాముల చక్కెర ఉంటుంది.

 

 

 


 

 

దానిమ్మ..
ఏక్ ఫల్ ..సౌ భీమారియ..దానిమ్మ పండుకు హిందీలో ఉన్న సామెత.. అంటే అనేక రోగాలకు దానిమ్మ సమాధానం అని అర్ధం. పండుగా కన్నా ఔషధ రూపంలోనే ఎక్కువగా మనకు ఉపయోగపడుతుంది. 100 మిల్లీ లీటర్ల దానిమ్మ జ్యూస్‌లో 12.65 గ్రాముల చక్కెర ఉంటుంది.

 

 

  

 

ద్రాక్ష
ద్రాక్ష.. రుచికి రుచి..ఆరోగ్యానికి ఆరోగ్యం. ఏ సీజన్‌లోనైన దొరికే ఈ ద్రాక్ష.. శరీరానికి అవసరమైన ఐరన్, కాపర్, మెగ్నీషియం వంటి ఖనిజాలను అందిస్తుంది. ఇక చక్కెర విషయానికి వస్తే.. 100 మిల్లీ లీటర్ల ద్రాక్ష జ్యూస్‌లో 14.2 గ్రాముల చక్కెర ఉంటుంది.


 

 

 


 

 

ఆరెంజ్‌
చూడటానికి కళ్లకు కలర్ ఫుల్ గా ఆకర్షించడమే కాకుండా రుచికరంగానూ ఉండే కమలాపండులో అనేక ఆరోగ్య ప్రయోజనాలు దాగున్నాయి. 100 మిల్లీ లీటర్ల ఆరెంజ్‌ జ్యూస్‌లో 8.4 గ్రాముల చక్కెర ఉంటుంది.

 

 

 


 


అవకాడో..
అవకాడో ఫలాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. మెదడు పనితీరునే కాకుండా  కంటి ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది. ఇందులో చక్కెర స్థాయి అతి తక్కువగా ఉంటుంది. ఒక అవకాడో పండులో కేవలం 1 గ్రాము చక్కెరే ఉంటుంది.

 

 

 


 


మామిడి..
పచ్చిదైనా, పండైనా, చివరికి ఎండిన మామిడైనా సరే..  ఔషధ గుణాలు మాత్రం తగ్గవు. మామిడితో తయారు చేసే చూర్ణంతో కూడా ఎన్నో ప్రయోజనాలున్నాయి. చక్కెర శాతం మాత్రం ఇందులో ఎక్కువగానే ఉంటుంది. ఒక చిన్న సైజు మేంగోలో 23 గ్రాముల చక్కెర ఉంటుంది. 

 

 

 


 

 


చెర్రీ..
ఎరుపు రంగులో ఆకర్షణీయంగా ఉండి.. చూడగానే నోట్లో వేసుకోవాల‌నిపించే చెర్రీ పండ్లంటే అందరికీ ఇష్టమే. నేరేడు జాతికి చెందిన ఈ పళ్లలో మంచి పోషకాలున్నాయి. ఇందులో ఉన్న యాంటీ ఇన్‌ఫ్లేమెటరీ కెమికల్‌ గుండె సంబంధిత వ్యాధులను దూరం చేస్తాయి. ఒక కప్పుడు చెర్రీస్‌లో 19 గ్రామలు చక్కెర ఉంటుంది.

 

 


 


స్ట్రాబెర్రీ..
స్ట్రాబెర్రీ పండ్లలోని ఫ్లెవనాయిడ్లు వ్యాధినిరోధ శక్తిని పెంచుతుంది. యాంటీయాక్సిడెంట్లు పుష్కలంగా ఉండే స్టాబెర్రీస్‌ను తీసుకోవడం ద్వారా శరీరానికి కావలసిన పోషకాలు అందుతాయి. స్ట్రాబెర్రీస్‌లో విటమిన్ సి, విటమిన్ ఎ, విటమిన్ కె, మాగ్నీషియం, అయోడిన్, ఫాస్పరస్, క్యాల్షియం, ఐరన్ వంటి పోషకాలున్నాయి. ఇక.. చక్కెర శాతం విషయానికి వస్తే.. ఒక కప్పుడు స్ట్రాబెర్రీలలో 7 గ్రాముల చక్కెర ఉంటుంది. 

 

 

 


 

జామ
రోజూ దోర జామకాయ తింటే ప్రోస్టేట్ క్యాన్సర్‌ను అరికట్టవచ్చు. పచ్చికాయ తింటే చిగుళ్లు, దంతాలు గట్టిపడతాయి. పండైనా, కాయైనా పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఒక జామకాయలో 5 గ్రాముల చక్కెర ఉంటుంది.

 

 

 

 


 


అరటి
రోజుకు ఒక అరటి పండు తినడం వల్ల శరీరానికి ఐరన్ పుష్కలంగా లభిస్తుంది. అజీర్ణాన్ని తగ్గించడంలో, కడుపులోని అల్సర్లను మాన్పించడంలో అరటి తోడ్పడుతుంది. అరటిలో ఉండే పొటాషియం నరాలను ఉత్తేజపరచి రక్తప్రసరణ వేగాన్ని పెంచుతుంది. ఒక అరటి పండులో 14 గ్రాముల చక్కెర ఉంటుంది.