ఐదో రోజూ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

ఐదో రోజూ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

అంతర్జాతీయ మార్కెట్లలో ముడిచమురు ధరలు పెరుగుతుండటంతో దేశంలో ఇంధన ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. దీంతో వరుసగా ఐదో రోజు పెట్రోల్‌, డీజిల్‌ ధరలు భగ్గుమంటున్నాయి. ప్రధాన ఇంధన కంపెనీలు సోమవారం పెట్రోల్‌పై 37-40 పైసలు, డీజిల్‌పై 49-53పైసలు పెంచాయి. దీంతో ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 70.13, కోల్‌కతాలో రూ. 72.24, ముంబయిలో రూ. 75.77, చెన్నైలో రూ. 72.79గా ఉంది. ఇక డీజిల్‌ ధర ఢిల్లీలో రూ. 64.18, కోల్‌కతాలో రూ. 65.95, ముంబయిలో రూ. 67.18, చెన్నైలో రూ. 67.78గా ఉంది. కొత్త ఏడాదిలో ఇప్పటి వరకు మొత్తం ఆరు సార్లు ఇంధన ధరలు పెరిగాయి.