ఆరో రోజూ 'పెట్రో' బాదుడు..

ఆరో రోజూ 'పెట్రో' బాదుడు..

దేశంలో ఇంధన ధరలు పెరుగుతూనే ఉన్నాయి. వరుసగా ఆరో రోజు కూడా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి.  పెట్రోల్ ధర 7 పైసలు, డీజిల్ ధర 10 పైసలు పెరిగింది. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.72.24 వద్ద.. డీజిల్ ధర రూ.67.64 వద్ద కొనసాగుతోంది. ముంబైలో పెట్రోల్ ధర రూ.77.87 ఉండగా.. డీజిల్ ధర రూ.70.86గా ఉంది. కోల్‌కతాలో లీటర్‌ పెట్రోల్‌ రూ.74.33.. లీటర్‌ డీజిల్‌ రూ.69.43 వద్ద కొనసాగుతోంది. చెన్నైలో లీటర్‌ పెట్రోల్‌ రూ.75.02 ఉండగా.. లీటర్‌ డీజిల్‌ రూ.71.49 వద్ద కొనసాగుతోంది.