IPL 2021 : ఏయే జట్టు ఎవరెవరిని వదులుకుంది అంటే ?

IPL 2021 : ఏయే జట్టు ఎవరెవరిని వదులుకుంది అంటే ?

యూఏఈ వేదికగా జరిగిన ఐపీఎల్ 2020 సక్సెస్ కావడంతో ఐపీఎల్ 2021 సీజన్‌కు ముందు ఆటగాళ్ల వేలాన్ని ఫిబ్రవరిలో నిర్వహించే అవకాశముందని చెబుతున్నారు. ఐపీఎల్ మినీ వేలం ఫిబ్రవరి 11న నిర్వహించాలని ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ప్రాథమికంగా నిర్ణయించిందని సమాచారం. ఐపీఎల్‌ పాలక మండలి రాబోయే 14వ సీజన్‌ కోసం ఫ్రాంఛైజీల మధ్య ఆటగాళ్ల బదిలీ ప్రక్రియ ప్రారంభించింది. ఈరోజు తమకు అవసరం లేదనుకున్న క్రికెటర్లను జట్లు వదిలేసుకోవాలని చుచించడంతో కొన్ని జట్లు తమకు వద్దు అనుకుంటున్న ఆటగాళ్ళ లిస్టుని విడుదల చేశాయి. ముంబై ఇండియన్స్ జట్టు మలింగ, ప్యాటిన్సన్, మెక్లేనగాన్, కౌల్టర్ నీల్, రూధర్ ఫర్డ్ ల పేర్లను రిలీజ్ చేసింది. చెన్నై సూపర్ కింగ్స్ నుండి హర్భజన్ సింగ్, పీయూష్ చావ్లా, మురళీ విజయ్, కేదార్ జాదవ్, షేన్ వాట్సన్ ల పేర్లు రిలీజ్ చేశారు. రాజస్థాన్ రాయల్స్ నుండి స్మిత్, సన్ రైజర్స్ హైదరాబాద్ నుండి స్టాన్ లేక్, సంజయ్ యాదవ్, పృధ్వీ రాజ్, అలెన్ ల పేర్లు విడుదల చేసింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నుండి మోరిస్, మొయిన్ అలీ, ఫించ్, ఉమేష్ యాదవ్, ఉడానా, శివం దూబేల పేర్లు విడుదల చేశాయి. అలానే పంజాబ్ విషయానికి వస్తే మాక్స్ వెల్, కాట్రెల్, ముజీబ్ రెహ్మాన్, నీషం, కరుణ నాయర్ ల పేర్లు విడుదల చేశారు.