రూల్‌ 71పై చర్చకు అనుమతించిన మండలి ఛైర్మన్‌

రూల్‌ 71పై చర్చకు అనుమతించిన మండలి ఛైర్మన్‌

 వాయిదా అనంతరం తిరిగి శాసన మండలి ప్రారంభమైంది. శాసన మండలిలో మళ్లి గందరగోళం నెలకొంది. మూడు రాజధానుల రగడ కొనసాగుతోంది. మండలి ఛైర్మన్‌ రూల్‌ 71పై చర్చకు అనుమతించారు. దీంతో వైసీపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేసి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. దీంతో మళ్ళీ ఐదో సారి శాసన మండలి వాయిదా పడింది. మండలి ఛైర్మన్ రూల్ 71పై చర్చ ప్రారంభిద్దామని అనడంతో లేదు బిల్లులను సభ పరిగణనలోకి తీసుకున్నట్టు ప్రకటించి రూల్ 71పై చర్చ జరపాలని బుగ్గన డిమాండ్ చేశారు. అయితే రూల్ 71 పైనే చర్చ జరగాలని యనమల పట్టుపట్టారు. కావాలంటే బిల్లులను తిరస్కరించాలని.. బిల్లులను అడ్డుకోవడం తగదని బొత్స పేర్కొన్నారు. మేం అన్ని రకాలుగా సహకరించేందుకు సిద్దంగా ఉన్నామని, ఈ విధంగా మండలి ఛైర్మనుగా ఈ విధంగా వ్యవహరించడం సరికాదని అన్నారు.