ట్రైలర్లో రియాలిటీతో పాటు బూతులు కూడా !

ట్రైలర్లో రియాలిటీతో పాటు బూతులు కూడా !

మారుతున్న ప్రేక్షకుల అభిరుచుకి తగ్గట్టు దర్శకులు తమ సినిమాల్లో వాస్తవికత ఎక్కువగా ఉండేలా చూసుకుంటున్నారు.  అందుకు ఉదాహరణే కొద్దిసేపటి క్రితమే విడుదలైన 'ఫలక్‌నుమా దాస్' సినిమా ట్రైలర్.  నటుడు విశ్వక్‌సేన్‌ స్వీయ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఇది.  ట్రేలర్ చూస్తే సినిమాలో వాస్తవిక పరిస్థితులు, వాస్తవిక పాత్రలతో పాటు బోలెడు బూతులు కూడా ఉంటాయనిపిస్తోంది.  ఫలక్‌నుమా లాంటి మాస్ ఏరియాలో విరివిగా వాడుకలో ఉండే బూతులనే ఈ నిమాలో బాగా వాడారు.  ఇక కంటెంట్ విషయానికొస్తే యువతను ఆకట్టుకునే గ్రిప్పింగ్ స్టఫ్ చిత్రంలో ఉందనే అనిపిస్తోంది.