రూపాయికే అంతిమయాత్రను ప్రారంభించిన మేయర్

రూపాయికే అంతిమయాత్రను ప్రారంభించిన మేయర్

పేదల అంత్యక్రియలు వారి కుటుంబీకులకు భారం కావద్దనే ఉద్దేశ్యంతో కరీంనగర్ నగరపాలక సంస్థ రూపొందించిన రూపాయికే అంతిమయాత్ర కార్యక్రమాన్ని మేయర్ రవీందర్‌ సింగ్ లాంఛనంగా ప్రారంభించారు. సాధారణ మరణం పొందిన మంచాల లలిత అంతిమయాత్రలో మేయర్ పాల్గొని స్వయంగా పాడె మోశారు. అంత్యక్రియలకు సంబంధించిన తొలి రసీదును లలిత భర్తకు అందించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ.. వృద్ధులకు పింఛన్‌ పంపిణీ సందర్భంలో ప్రతి నెలా రూ.100లను అంతిమ సంస్కారాలకు దాచుకుంటున్నామని పలువురు తన దృష్టికి తీసుకురావడంతో తన హృదయం ద్రవించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. పేదలకు అంతిమ సంస్కారాలు భారం కాకూడదన్నదే తన ఉద్దేశమని, ఈ విధానాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తే బాగుంటుందని మేయర్ రవీందర్ సింగ్ సూచించారు.