వైరల్: నేరస్తుడే బైక్ డ్రైవర్ గా మారితే... 

వైరల్: నేరస్తుడే బైక్ డ్రైవర్ గా మారితే... 

చాలా సీరియస్ గా ఉండే కొన్ని ఫోటోలు అప్పుడప్పుడు నవ్వును తెప్పిస్తుంటాయి.  సీరియస్ విషయం అయినప్పటికీ కూడా చూడగానే ముందు నవ్వు వస్తుంది.  ఆ తరువాత ఆలోచన వస్తుంది.  అలా ఎందుకు చేశారని ఆలోచించడం మొదలుపెడుతుంది. ఇక్కడ ఉన్న ఫోటో కూడా అదే విధంగా ఆలోచింపజేస్తుంది.  మాములుగా తప్పు చేసిన వాళ్ళను పోలీసులు జీబులో తీసుకెళ్లారు లేదంటే మరో వాహనంలో ఎక్కించుకొని వెళ్లారు.  

కానీ, పాకిస్తాన్ లోని పంజాబ్ ప్రాంతంలో ఓ నేరస్తుడిని బైకుపై తీసుకెళ్తున్నాడు.  బైక్ మీద నేరస్తుడిని వెనక కూర్చోపెడితే ఎక్కడ పారిపోతాడో అని చెప్పి ఒక చేతికి సంకెళ్లు వేసి చైన్ ను తన జేబులో పెట్టుకున్నాడు.  నేరస్తుడు బైక్ నడుపుతుండగా, పోలీస్ అధికారి వెనక కూర్చున్నాడు.  ఇలా వెళ్తుండగా ఓ వ్యక్తి ఫోటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.  ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.