రోడ్డు ప్రమాదంలో సినీ నటుడికి గాయాలు

రోడ్డు ప్రమాదంలో సినీ నటుడికి గాయాలు

పవన్‌కల్యాణ్‌ హీరోగా నటించిన 'గబ్బర్‌సింగ్‌'లో అలరించిన నటుడు ఆంజనేయులు రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్టు ప్రాంతంలో గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో ఆంజనేయులకు, ఆయన భార్యకు గాయాలయ్యాయి. ఇందిరా న‌గ‌ర్ ప్రాంతంలో నివ‌సించే ఆంజ‌నేయులు త‌న భార్యతో క‌లిసి జూబ్లీ చెక్‌పోస్టు మీదుగా గచ్చిబౌలి వైపు వెళ్తుండగా.. వెనుక నుంచి వేగంగా వ‌చ్చిన కారు వీరి బైక్‌ని డీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆంజనేయులు కాళ్లకు, చేతులకు గాయలయ్యాయి. ఆయన భార్యకు స్వల్పగాయాలయ్యాయి. ఆంజనేయులు ఫిర్యాదు మేరకు ప్రమాదానికి కారణమైన కారును గుర్తించేందుకు పోలీసులు సీసీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.