ఎల్వీ సుబ్రమణ్యం షోకాజ్ నోటీసు.. రిప్లై ఇచ్చిన జీఏడీ ప్రిన్సిపల్ సెక్రటరీ..

ఎల్వీ సుబ్రమణ్యం షోకాజ్ నోటీసు.. రిప్లై ఇచ్చిన జీఏడీ ప్రిన్సిపల్ సెక్రటరీ..

ఆంధ్రప్రదేశ్‌ మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం బదిలీ వ్యవహారం హాట్‌టాపిక్‌గా మారింది. అయితే.. మాజీ సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం ఇచ్చిన షోకాజ్ నోటీసుకు రిప్లై ఇచ్చారు జీఏడీ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్. ప్రస్తుత సీఎస్ నీరబ్ కుమారుకు వివరణతో కూడిన లేఖరాశారు.. తన వైపు నుంచి ఎటువంటి నిబంధనల ఉల్లంఘనలు జరగలేదని లేఖలో స్పష్టం చేసిన ప్రవీణ్. వైఎస్సార్ లైఫ్ టైం అవార్డులు.. గ్రామ న్యాయలయాల విషయంలో అప్పటి సీఎస్ సమక్షంలో తీసుకున్న నిర్ణయాల మేరకే నిబంధనల మేరకు తాను వ్యవహరించానని స్పష్టం చేశారు.

గ్రామ న్యాయాలయాల అంశాన్ని కేబినెట్ ముందుకు తీసుకురాకపోవడానికి గల కారణాలను కూడా ఎల్వీ సుబ్రమణ్యంకు వివరించానని లేఖలో పేర్కొన్నారు ప్రవీణ్ ప్రకాష్.. తన వివరణను పట్టించుకోకుండా షోకాజ్ నోటీసుఇవ్వడం బాధించిందన్నారు. ప్రజలకు సత్వర న్యాయం.. లబ్ధి చేకూర్చేలా వ్యవహరించడం ఏపీ కేడరుకున్న ప్రత్యేకత అని లేఖలో పేర్కొన్న ప్రవీణ్... సీనియర్ ఐఏఎస్ అధికారులు ఎస్ఆర్ శంకరన్, ఏవీఎస్ రెడ్డి, యుగంధర్ వంటి వారి స్పూర్తితో ఏపీ కేడర్ పని చేస్తోందన్నారు. ఆ స్ఫూర్తికి విరుద్ధంగా ఈ ఎపిసోడ్ తెరపైకి రావడం తనకు ఆశ్చర్యం కలిగించిందన్నారు ప్రవీణ్ ప్రకాష్.