మావోయిస్టుల బ్లాస్ట్‌పై వెలుగులోకి కొత్త విషయాలు..

మావోయిస్టుల బ్లాస్ట్‌పై వెలుగులోకి కొత్త విషయాలు..

మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా జాంబర్‌కేడ దగ్గర మావోయిస్టుల దాడి ఘటనలో కొత్త విషయాలు వెలుగుచూస్తున్నాయి. ఈ బ్లాస్ట్‌లో 15 మంది జవాన్లతో పాటు ఓ ప్రైవేట్ డ్రైవర్ మృతిచెందగా.. విచారణ  జరుపుతోన్న పోలీసులు కొత్త విషయాలు గుర్తిస్తున్నారు. మరోవైపు ఘటన జరిగిన సమీపంలో మాగ్జీన్‌ను గుర్తించారు స్థానికులు.. ఇంకా అక్కడక్కడ మాంసం ముద్దలుగా మారిపోయిన జవాన్లను గుర్తించారు. ఓ జవాన్ అరచేతిని బ్లాస్ కు సమీపంలోని గ్రామస్తులకు కనబడింది. దీంతో పోలీసులు వాటిని సేకరించే పనిలో ఉన్నారు. అయితే, ఈ ఘటన తర్వాత మావోయిస్టులు జవాన్ల వెపన్స్‌తో పరారైనట్టు నిర్ధారణకు వస్తున్నారు. ఈ మొత్తం యాక్షన్‌లో ఓమహిళ, నలుగురు మావోలు పాల్గొన్నట్టు సమాచారం. కుర్‌కేడ్ పోలీస్ స్టేషన్ వద్దనే ఇద్దరు రెక్కి నిర్వహించినట్టు తెలుస్తోంది. వాహనం బయటకు వెళ్లిన వెంటనే అక్కడి వారికి సమాచారం అందించినట్టు తెలుస్తోంది.