గద్దలకొండ గణేష్ ఫస్ట్ రివ్యూ..!!!

గద్దలకొండ గణేష్ ఫస్ట్ రివ్యూ..!!!

వరుణ్ తేజ్ హీరోగా చేస్తున్న వాల్మీకి అలియాస్ గద్దలకొండ గణేష్ సినిమా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యింది.  ఇప్పటికే చాలా చోట్ల ప్రీమియర్ షోలు ముగిశాయి.  సినిమాను చూసిన నెటిజన్లు గద్దలకొండ గణేష్ పాత్రలో వరుణ్ తేజ్ అదిరిపోయే విధంగా నటించారని ట్వీట్ చేస్తున్నారు.  గణేష్ పాత్రలో వరుణ్ తేజ్ నటన, మేనరిజం, డైలాగ్స్ అదుర్స్ అని అంటున్నారు.  

అప్పట్లో చిరంజీవి నటించిన పున్నమినాగు సినిమాలో మెగాస్టార్ ఎలా కనిపించారో ఈ సినిమాలో వరుణ్ కూడా అదే విధంగా కనిపించారని కొందరు ట్వీట్ చేశారు.  ట్విట్టర్ రివ్యూ ప్రకారం సినిమా సూపర్ అని రెస్పాన్స్ వస్తున్నది.  ఇకతెలుగు రాష్ట్రాల్లో కొన్ని చోట్ల ఇప్పటికే షోలు ప్రారంభం అయ్యాయి.  మరి కాసేపట్లోనే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి రివ్యూ వచ్చేస్తుంది. వరుణ్ కు జోడిగా పూజా హెగ్డే నటిస్తోంది.  అధర్వ మురళి నటన సినిమాకు ప్లస్ అయినట్టు తెలుస్తోంది.  హరీష్ శంకర్ దర్శకత్వం సినిమాను మరో స్టేజికి తీసుకెళ్లిందని అంటున్నారు.  14 రీల్స్ పతాకంపై తెరకెక్కిన ఈ సినిమాకు మిక్కీ జె మేయర్ మ్యూజిక్ అందించారు.