హోదా కోసం బాబు, జగన్, పవన్ ఏకం కావాలి...

హోదా కోసం బాబు, జగన్, పవన్ ఏకం కావాలి...

ప్రత్యేకహోదా ఉద్యమం కోసమైనా సీఎం చంద్రబాబు నాయుడు, ప్రతిపక్ష నేత జగన్, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌ ఏకమై పోరాటం చేయాలని సూచించారు ప్రజా గాయకుడు గద్దర్... శ్రీకాకుళంలో జరిగిన దళిత హక్కుల మహాసభలో పాల్గొని ప్రసంగించిన ఆయన... అంబేద్కర్ ఆశయాలను కొనసాగించాలంటే దళితులు అధికారంలోకి రావాలన్నారు. ఓట్ల యుద్ధానికి దళిత యువత సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చిన గద్దర్... దళితులు రాజ్యాంగేతర శక్తిగా ఎదగాలన్నారు. మేం అధికారంలోకి వస్తే.... ఉచిత విద్య, వైద్యం అందిస్తామని మాటివ్వండి.. చేసి చూపండి అని సూచించిన ప్రజా గాయకుడు... ప్రతీ గ్రామంలో తిరిగి అంబేద్కర్ ఆశయాల పై ప్రచారం చేయాలని... పల్లెపల్లెకు పాట... పార్లమెంట్ కు బాట నినాదంతో దళితులు ముందుకు సాగాలని నిర్దేశించారు.

రిజర్వేషన్లపై గెలిచిన ఎంపీలు, ఎమ్మెల్యేలు సమాజం కోసం ఏం త్యాగం చేశారో చెప్పాలని ప్రశ్నించారు గద్దర్... ఎస్సీ, ఎస్టీ చట్టంపై పార్లమెంట్ లో బిల్లు పెట్టాలని డిమాండ్ చేసిన ఆయన... మరోవైపు ప్రత్యేకహోదా వస్తే మనమే రాజులమవుతామని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, దక్షిణాది రాష్ట్రాల్లో 120 ఎంపీ సీట్లు గెలిస్తే ప్రత్యేకహోదా అదే వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.