టీఆర్ఎస్, బీజేపీలను ఓడిద్దాం: గద్దర్

టీఆర్ఎస్, బీజేపీలను ఓడిద్దాం: గద్దర్

ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్, బీజేపీలను ఓడించాలని గాయకుడు గద్దర్‌ పిలుపునిచ్చారు. బుధవారం ప్రజకూటమి మీడియా సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా గద్దర్ మాట్లాడుతూ... నాలుగు కోట్ల ప్రజల ఫ్రంటే 'ప్రజాఫ్రంట్‌' అని పేర్కొన్నారు. ప్రజల వెంటే ప్రజా ఫ్రెంట్ ఉంటుందన్నారు. సామాజిక న్యాయం, వ్యూహం ఎక్కడ ఉందంటే ఈ వేదిక మీద కనపడుతుందన్నారు. అమరుల స్వప్నాన్ని సాకారం చేసుకుందాం. ప్రజలకు ద్రోహం చేసిన టీఆర్ఎస్, బీజేపీలను ఓడిద్దాం. ప్రజాఫ్రంట్‌ని గెలిపించి త్యాగాల తెలంగాణ నిర్మించుకుందాం అని గద్దర్ తెలిపారు.