బాబు కొడుకునో, మూర్తి మనవడ్నో నిరాహార దీక్షకు ఎందుకు కూర్చోబెట్టలేదు ?

బాబు కొడుకునో, మూర్తి మనవడ్నో నిరాహార దీక్షకు ఎందుకు కూర్చోబెట్టలేదు ?

ఫేక్ వెబ్ సైట్లు, ఫేక్ ఫలితాలతో చంద్రబాబే పెద్ద ఫేక్ అని తేలిందని ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు. ఓటమిని ఒప్పుకునే ధైర్యం లేని చంద్రబాబు చీకట్లో లెక్కపెట్టారంటూ సిగ్గులేని వాదనలు చేస్తున్నారని ఆయన అన్నారు.  కరోనా తర్వాత బలహీనంగా ఉన్న పల్లా శ్రీనివాస్ ను ఆసుపత్రికి తరలిస్తే తప్పేంటి? అని ఆయన ప్రశ్నించారు. అలానే  పల్లా బదులు చంద్రబాబు కొడుకునో, ఎంవీవీఎస్ మూర్తి మనవడ్నో నిరాహార దీక్షకు ఎందుకు కూర్చోబెట్టలేదు? అని ఆయన అన్నారు. విశాఖలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ వద్దన్న తండ్రీ,కొడుకులు ఏ మొహం పెట్టుకుని విశాఖలో అడుగు పెడతారు..? అంటూ ఆయన విమర్శించారు. అమరావతిలోనే అన్నీ ఉండాలంటున్న వారిని చంద్రబాబు విశాఖకు ఎలా తీసుకెళ్ళారు..? అని ఆయన ప్రశ్నించారు. విశాఖ స్టీల్ ప్రైవేటీకరణపై 2014-19 మధ్య చంద్రబాబు ఎందుకు మౌనంగా ఉన్నాడని ప్రశ్నించిన ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 54 ప్రభుత్వరంగ సంస్థల్ని ఇష్టారాజ్యంగా ప్రైవేటీకరించి అమ్మింది చంద్రబాబు కాదా.. ? అని ప్రశ్నించారు. అలానే  ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన జగన్.. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను ఆమోదిస్తారా..? అని ప్రశ్నించారు.