పవన్‌పైనే విజయం సాధించా..

పవన్‌పైనే విజయం సాధించా..

ఇప్పుడు అందరి దృష్టి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయంపైనే... మంత్రి వర్గంలో ఎవరికి చోటు ఇస్తారు..? ఎవరికి మొండిచేయి చూపుతారు? అనే చర్చ జరుగుతోంది. అయితే, మంత్రి పదవి ఇవ్వమని నేను అడగలేదు... కానీ, అన్ని అర్హతలు ఉన్నవారికే సీఎం వైఎస్ జగన్ మంత్రి పదవి ఇస్తారని అనుకుంటున్నానని వెల్లడించారు గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి. ఆంధ్రప్రదేశ్‌ కేబినెట్‌ వ్యవహారంపై ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన.. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పైనే నేను గాజువాకలో విజయం సాధించానన్నారు. బీసీ వర్గానికి చెందిన వాడిన్న ఆయన.. తాను మాత్రం మంత్రి పదవి కావాలని అడగలేదు.. కానీ, అర్హతలు ఉన్నవారికే ఇస్తారని అనుకుంటున్నానని వ్యాఖ్యానించారు.