శాంసంగ్ నుండి కొత్త స్మార్ట్‌ఫోన్

శాంసంగ్ నుండి కొత్త స్మార్ట్‌ఫోన్

దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ శాంసంగ్ తన ఏ-సిరీస్‌ నుండి మరో స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్‌లోకి తీసుకురానుంది. శాంసంగ్ ఇప్పటికే గెలాక్సీ ఏ సిరీస్ లో భాగంగా గెలాక్సీ ఏ10, గెలాక్సీ ఏ30, గెలాక్సీ ఏ50 స్మార్ట్‌ఫోన్లను విడుదల చేసింది. గెలాక్సీ ఏ40, గెలాక్సీ ఏ70 స్మార్ట్‌ఫోన్లకు కూడా త్వరలో తీసుకురానుంది. అయితే గెలాక్సీ ఏ60 స్మార్ట్‌ఫోన్‌ను కూడా శాంసంగ్ విడుదల చేస్తున్నట్లు ఆన్‌లైన్‌లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అధికారిక లాంచ్ కన్నా ముందే ఫోన్ ప్రత్యేకతలు ఆన్‌లైన్‌లో ప్రత్యక్షమయ్యాయి. ఈ సమాచారం ప్రకారం గెలాక్సీ ఏ60 స్మార్ట్‌ఫోన్‌ ఏప్రిల్ 19న మార్కెట్‌లోకి విడుదల కానుంది. ఆన్‌లైన్‌లో వార్తల ప్రకారం గెలాక్సీ ఏ60 స్మార్ట్‌ఫోన్‌లో పలు ఫీచర్లు ఉన్నాయి.

ఫీచర్లు:

# 6.7 అంగుళాల ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే  
# 32+5+8 ట్రిపుల్ బ్యాక్ కెమెరాలు
# 32 ఫ్రంట్ కెమెరా 
# స్నాప్‌డ్రాగన్ 675 ప్రాసెసర్ 
# 6/8 జీబీ ర్యామ్.. 128 బీజీ స్టోరేజ్  
# 3డీ గ్లాసెటిక్ బ్యాక్ ప్యానెల్ 
# ఇన్‌డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సర్
# 4,500 ఎంఏహెచ్ బ్యాటరీ