చర్చ ప్రారంభించనున్న గల్లా జయదేవ

చర్చ ప్రారంభించనున్న గల్లా జయదేవ

రేపు లోక్‌సభలో అవిశ్వాసం తీర్మానంపై జరిగే చర్చను టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ ప్రారంభించనున్నారు. వాస్తవానికి తీర్మానం ఇచ్చిన కేశినేని నాని చర్చను ప్రారంభించే అవకాశం ఉన్నా... గల్లా జయదేవ చేత మాట్లాడించాలని పార్టీ అధినేత చంద్రబాబు నిర్ణయించారు. అనేక అంశాలపై అవగాహన ఉండటంతో పాటు అనర్గళంగా ఇంగ్లీషులో మాట్లాడగలగే సామర్థ్యం ఉంది. ఈ మేరకు  గల్లా జయదేవ్ కు అవకాశం ఇవ్వాలని పార్టీ నిర్ణయించినట్లు తెలిసింది. పార్టీ అధినేత చెప్పినట్లు నడుచుకుంటానని కేశినేని నాని అన్నారు. మధ్యలో అవకాశమొస్తే కేశినేని నానితో పాటు రామ్మోహన్‌ నాయుడుకు అవకాశం ఇవ్వాలని టీడీపీ నిర్ణయించింది.