'లోకేష్‌కి, మహేష్‌కి మంగళగిరిలో డ్రెస్‌ కుట్టిస్తా..'

'లోకేష్‌కి, మహేష్‌కి మంగళగిరిలో డ్రెస్‌ కుట్టిస్తా..'

'చంద్రబాబునాయుడు బ్రాండ్‌తోనే అమరావతి అభివృద్ధి చెందుతోంది. లోకేష్‌ బ్రాండ్‌తో ఇక మంగళగిరి అభివృద్ధి చెందుతుంది' అని అన్నారు గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్‌. ఇవాళ మంగళగిరిలో ఆయన మాట్లాడుతూ లోకేష్‌ను మనకు గిఫ్ట్‌గా చంద్రబాబు పంపించారని అన్నారు. ఇకపై ఫ్యాషన్‌కి మంగళగిరి కేంద్రం అవుతుందన్న జయదేవ్‌.. తన డ్రెస్‌ 'మేడ్ ఇన్‌ మంగళగిరి' అని చెప్పారు. 

'మంగళగిరి షాలిమార్ టైలర్ నా డ్రెస్‌ కుడతారు. సూపర్‌స్టార్‌ మహేష్‌బాబుకు కూడా ఇక్కడే డ్రెస్‌ కుట్టించబోతున్నాను. లోకేష్‌కి కూడా షాలిమార్‌ టైలర్స్‌ దగ్గరే డ్రెస్‌ కుట్టిస్తాను' అని తెలిపారు.  

త్వరలోనే మంగళగిరికి పసుపు రీసెర్చ్ కేంద్రం వస్తుందన్న జయదేవ్.. రూ.600 కోట్లతో మంగళగిరిని అభివృద్ధి చేశామన్నారు. 120 సార్లు తాను పార్లమెంట్‌లో మాట్లాడితే అందులో 40 సార్లు మంగళగిరి గురించి ప్రస్తావించానని చెప్పారు.