పోలీసుల మీద గల్లా సంచలన ఆరోపణలు

పోలీసుల మీద గల్లా సంచలన ఆరోపణలు

అసెంబ్లీ ముట్టడి సందర్భంగా అరెస్ట్ అయిన తెలుగుదేశానికి చెందిన గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ రిలీజ్ అయ్యారు. గుంటూరు సబ్ జైలు నుంచి విడుదలైన సందర్భంగా ఆయన మాట్లాడుతూ అసెంబ్లీ ముట్టడి సందర్భంగా పోలీసులు దుర్మార్గంగా వ్యవహరించారని అన్నారు. ముట్టడి చేసేందుకు వెళుతుంటే పోలీసులే రాళ్లు రువ్వి లాఠీఛార్జి చేశారన్నారు. పోలీసుల వైఖరి సరికాదని ప్రశ్నించినందుకు అరెస్టు చేశారన్నారు. పోలీసులు దారుణంగా గోళ్లతో రక్కారని అన్నారు. తన చేతులను పోలీసులు వెనక్కి విరిచారని ఆయన ఆరోపించారు. పోలీసుల దాడిలో గాయపడితే వైద్యం కూడా అందించలేదన్నారు. తన పట్ల పోలీసులు దారుణంగా వ్యవహరించారన్నారు. అదుపులోకి తీసుకున్న 15 గంటలపాటు వ్యాన్ లో తిప్పారన్నారు. శాంతియుత ప్రదర్శన చేస్తే ఇలా వేధిస్తారా అని జయదేవ్ ప్రశ్నించారు. ఎంపీనే ఇలా వేధిస్తే సామాన్యులు, రైతుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. పోలీసులు సీఆర్పీఎఫ్ బలగాలతో లాఠీఛార్జి చేయించారన్నారు. కేంద్ర బలగాలపై చర్యలు ఉండవని ఇలా చేశారన్నారు.