హార్దిక్ లేకపోతే మరొకరు ఎవరు : గంభీర్

హార్దిక్ లేకపోతే మరొకరు ఎవరు : గంభీర్

కరోనా విరామం తర్వాత భారత జట్టు ఆసీస్ తో ఆడిన మొదటి మ్యాచ్ లో 66 పరుగులతో ఓడిపోయిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో 5 బౌలర్లతో బరిలోకి దిగ్గిన భారత్ పరుగులను కట్టడి చేయలేకపోయింది. దాంతో ఆసీస్ ఆటగాళ్లు భారత్ ముందు 375 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచారు. అయితే లక్ష్య ఛేదనలో భారత జట్టు తడపడింది. అయితే ఈ మ్యాచ్ లో భారత్ తరపున అత్యధిక పరుగులు చేసింది ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా(90). కానీ పూర్తిగా ఫిట్ గా లేను కారణంగా అతను బౌలింగ్ చేయలేదు. దాంతో పాండ్యా ఫిట్ గా లేకపోతే అతని స్థానంలో మరో ఆల్ రౌండర్ మన జట్టుకు ఎవరు ఉన్నారు అని గౌతమ్ గంభీర్ అన్నాడు. విజయ్ శంకర్ ను జట్టులోకి తీసుకున్న అతను బౌలింగ్ చేయగలడా.. అలాగే పాండ్యా లాగా బ్యాటింగ్ చేయగలడా అని ప్రశ్నించారు. ప్రస్తుతం జట్టులో లేని రోహిత్ శర్మ, మనీష్ పాండే ఎవరు వచ్చిన జట్టు పరిస్థితి మారదు. ఎందుకంటే... మన జట్టులో టాప్ 6 ఆటగాళ్లలో ఎవరు బౌలింగ్ చేయలేరు. అదే మనకు పెద్ద నష్టం అని గంభీర్ అన్నాడు. కానీ ఆసీస్ జట్టు పరిస్థితి ఇలా లేదు అని.. వారి జట్టులో మార్కస్ స్టోయినిస్, మ్యాక్స్వెల్ ఇలా చాలా మంది ఆటగాళ్లు ఉన్నారు అని గంభీర్ తెలిపాడు.