ఆస్ట్రేలియా టెస్ట్ లో నెం 1 ఎలా అయ్యింది...?

ఆస్ట్రేలియా టెస్ట్ లో నెం 1 ఎలా అయ్యింది...?

టెస్ట్ ర్యాంకింగ్స్‌లో ఆస్ట్రేలియా అగ్రస్థానానికి చేరుకోవడాన్ని ప్రశ్నించిన భారత మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) ర్యాంకింగ్ వ్యవస్థ పై విరుచుకుపడ్డాడు. గౌతమ్ గంభీర్ మాట్లాడుతూ... భారత జట్టు తమ ఇటీవలి కాలంలో టెస్ట్ సర్క్యూట్లో ఎక్కువ ప్రభావాన్ని చూపింది, స్వదేశం లో, ముఖ్యంగా ఆస్ట్రేలియాలో విజయాలతో చెలరేగింది అని అంటూనే గంభీర్ ఆస్ట్రేలియాకు నంబర్ 1 ట్యాగ్ను కూడా ప్రశ్నించాడు, వారు ఉపఖండంలో 'పూర్తిగా దయనీయంగా ఉన్నారు' అని తెలిపాడు. ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో ఉన్న భారతదేశం యొక్క 42 నెలల పాలన ఈ నెల ప్రారంభంలో ఐసీసీ తన ర్యాంకింగ్స్‌ను అప్‌డేట్ చేయడంలో, 2016-17 సీజన్ నుండి జట్లు సేకరించిన పాయింట్లను తొలగించింది. "అక్టోబర్ 2016 తరువాత భారతదేశం మొదటిసారిగా టెస్ట్ లో అగ్రస్థానంలో నిలిచింది. 

అయితే దీనికి కారణం భారతదేశం 12 టెస్టుల్లో గెలిచి, 2016-17లో కేవలం ఒక టెస్టులో మాత్రమే ఓడిపోయింది, తాజా రికార్డులలో ఆ రికార్డులు తొలగించబడ్డాయి" అని ఐసీసీ ఒక ప్రకటన తెలిపింది. దాంతో భారత్ 3 వ స్థానానికి వచ్చింది, ఆస్ట్రేలియా ఆధిక్యంలో ఉండగా న్యూజిలాండ్ 2 వ స్థానంలో ఉంది. అయితే నాకు ఐసీసీ పాయింట్లు మరియు ర్యాంకింగ్ వ్యవస్థ పై నమ్మకం లేదు. బహుశా ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో చెత్త ఉంది అని గంభీర్ అన్నారు. అలాగే "నాకు, భారతదేశం నెం. 1 స్థానంలో ఉండాలి ఎందుకంటే ఆస్ట్రేలియా  పై నాకు తీవ్రమైన సందేహాలు ఉన్నాయి. మీరు ఆస్ట్రేలియాకు నంబర్ 1 ర్యాంకింగ్‌ను ఏం చూసి ఇచ్చారు? వారు స్వదేశం లో కాకుండా, ముఖ్యంగా ఉపఖండంలో పూర్తిగా దయనీయంగా ఉన్నారు. అయితే భారత్ స్వదేశం, విదేశం అని తేడాలేకుండా చెలరేగుతుంది అని అన్నాడు. చూడాలి మరి గంభీర్ వ్యాఖ్యల పై ఐసీసీ స్పందిస్తుందా.. లేదా అనేది.