రోడ్‌షో నిర్వహించిన గౌతమ్‌ గంభీర్‌

రోడ్‌షో నిర్వహించిన గౌతమ్‌ గంభీర్‌

మాజీ క్రికెట‌ర్‌, బీజేపీ తూర్పు ఢిల్లీ అభ్యర్థి గౌత‌మ్ గంభీర్‌ ఇవాళ దేశ రాజధానిలో రోడ్ షో నిర్వహించారు. ఇవాళ ఆయన నామినేషన్‌ వేయనున్న నేపథ్యంలో రోడ్‌ షోతో తరలివెళ్లారు. ఈ సందర్భంగా గంభీర్‌ మాట్లాడుతూ దేశానికి ఏదైనా సేవ చేయాల‌న్న సంక‌ల్పంతో ఉన్నానన్నారు. గత ఐదేళ్లలో మోడీ దేశానికి ఎంతో చేశారని.. ఆయణ్ను ఆదర్శంగా తీసుకుని ముందుకు వెళ్తానని చెప్పారు. అంతకముందు గంభీర్‌.. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.