కొత్త గవర్నర్‌కు ఘనస్వాగతం..

కొత్త గవర్నర్‌కు ఘనస్వాగతం..

ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌గా నియమితులైన తర్వాత తొలిసారి రాష్ట్రానికి వచ్చిన గవర్నర్ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ దంపతులకు ఘనస్వాగతం పలికారు అధికారులు... ప్రత్యేక విమానంలో రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న గవర్నర్‌కు జిల్లా కలెక్టర్ డా.భరత్ గుప్త, నగర పాలక కమిషనర్ గిరీషా, టీటీడీ చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి, జేఈవో బసంత్ కుమార్, మదనపల్లి సబ్ కలెక్టర్ కీర్తి, వెస్ట్ డీఎఫ్ ఓ సునీల్ కుమార్ రెడ్డి, తిరుపతి అర్బన్ ఎస్పీ అన్బు రాజన్ తదితరులు స్వాగతం పలికారు. అనంతరం రేణిగుంట విమానశ్రయం నుంచి తిరుమల శ్రీవారి దర్శనం కోసం రోడ్డు మార్గాన తిరుమలకు చేరుకున్నారు గవర్నర్‌ దంపతులు. శ్రీవారి దర్శనం అనంతరం మధ్యాహ్నం తిరుచానూరు అమ్మవారి దర్శించుకుని మధ్యాహ్నం 3 గంటలకు రేణిగుంట విమానాశ్రయం నుండి గన్నవరం బయల్దేరనున్నారు గవర్నర్.