గాంధీ ఆసుపత్రిలో అరుదైన ప్రసవం..

గాంధీ ఆసుపత్రిలో అరుదైన ప్రసవం..

సికింద్రాబాద్‌లోని గాంధీ ఆసుపత్రి వైద్యులు అరుదైన ప్రసవాన్ని విజయవంతంగా నిర్వహించారు. స్వైన్‌ఫ్లూ ఉన్న మహిళకు అదే వార్డులో ప్రసవం చేశారు. స్థానికంగా ఓ కార్పరేట్‌ ఆస్పత్రిలో ప్రసవం కోసం సంప్రదిస్తే రూ.25 లక్షలు ఫీజు చెల్లించమన్నారని.. గాంధీ వైద్యులు ఉచితంగా చేశారని సదరు మహిళ కుటుంబసభ్యులు చెప్పారు. తల్లీబిడ్డా ఇద్దరినీ వైద్యులు డిశ్చార్జి చేశారు. గాంధీ ఆస్పత్రి వైద్యులకు వారు కృతజ్ఞతలు చెప్పారు.