దర్శకుడిగా మారుతున్న గబ్బర్ సింగ్ డ్యాన్స్ మాస్టర్

దర్శకుడిగా మారుతున్న గబ్బర్ సింగ్ డ్యాన్స్ మాస్టర్

గబ్బర్ సింగ్ సినిమాతో టాలీవుడ్ లో డ్యాన్స్ మాస్టర్ గా మంచి పేరు తెచ్చుకున్నాడు గణేష్ మాస్టర్.  ఇందులోని దేఖో దేఖో గబ్బర్ సింగ్ అనే సాంగ్ కు డ్యాన్స్ కంపోసింగ్ సూపర్బ్ గా ఉంటుంది.  పవన్ మ్యానరిజంను టచ్ చేస్తూ చేసిన కంపోజింగ్ అందరిని ఆకట్టుకుంది.  ఈ సినిమా తరువాత గణేష్ మాస్టర్ చాలా సినిమాలు... స్టార్ హీరోల సినిమాలకు డ్యాన్స్ కంపోజ్ చేశారు. అనేక పెద్ద నిర్మాణ సంస్థలతో కలిసి పనిచేశారు.  

ఇదిలా ఉంటె, ఇప్పుడు ఈ కొరియోగ్రాఫర్ దర్శకుడిగా మారబోతున్నాడని వార్తలు వస్తున్నాయి.  ప్రభుదేవా, రాఘవ లారెన్స్ మాదిరిగానే ఈ దర్శకుడిగా అవతారం ఎత్తి మంచి సినిమాలు తీయాలని అనుకుంటున్నాడని సమాచారం.  ప్రస్తుతం కథపై దృష్టి పెట్టారని తెలుస్తోంది.  గణేష్ మాస్టర్ దర్శకుడిగా మారతారు అంటే కాదనే వాళ్ళు ఎవరున్నారు చెప్పండి.  అన్ని అనుకున్నట్టుగా జరిగితే టాలీవుడ్ కు మరో కొరియోగ్రాఫర్ దర్శకుడిని చూస్తాం.