'గ్యాంగ్ లీడర్' ఎలా ఉందంటే...?

'గ్యాంగ్ లీడర్' ఎలా ఉందంటే...?

మెగాస్టార్ చిరంజీవికి సూపర్ హిట్ ఇచ్చిన 'గ్యాంగ్ లీడర్' మూవీ టైటిల్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు నేచురల్ స్టార్ నానీ.. విక్రమ్‌ కె.కుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ ఇవాళే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మంచి అంచనాలతో ఈ మూవీ విడుదలైంది.. ఇక మనం తర్వాత మంచి హిట్ లేని విక్రమ్ కుమార్... ఈ మూవీకోసం అన్ని జాగ్రత్తలు తీసుకున్నాడట. ఈ మూవీని చూసిన ప్రేక్షకులు.. తమ అభిప్రాయాలను సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. హీరో నాని నటన, దర్శకుడి పనితనంపై ప్రశంసలు కురిపిస్తున్నారు ప్రేక్షకులు... ఫస్ట్ హాఫ్ టూ గుడ్.. సెకండ్ హాఫ్ బ్రిలియంట్ అని పేర్కొంటున్నారు. సినిమా కొంచెం మెల్లగా మొదలైనా.. ఆ తర్వాత ఊపందుకుంది. అక్కడక్కడా వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను నవ్విస్తాయి... కట్టిపడేస్తాయి... ఇక, కమెడియన్ వెన్నెల కిషోర్ ఈ సినిమాలో హైలెట్‌గా నిలిచాడని రాసుకొస్తున్నారు. ఇంటర్వెల్‌ వరకు సరదాగా సాగిన ఈ మూవీ.. ఓ ట్విస్ట్‌తో ఆడియన్స్‌కు ఈ సినిమాపై మరింత ఆసక్తి పెరిగేలా చేశారని దర్శకుడిని ప్రశంసిస్తున్నారు. 

ఇంటర్వెల్ తర్వాత కథ సీరియస్‌గా మారిపోయి ఉత్కంఠ రేపుతోందని.. స్క్రీన్ ప్లే‌తో ప్రీ క్లైమాక్స్ వరకు ఆడియన్స్ సినిమాతో ఎమోషనల్‌గా సాగేలా చేయడంలో దర్శకుడు విక్రమ్ ఫార్ములా విజయవంతం అయ్యిందంటున్నారు. ఇక క్లైమాక్స్ సీన్ ప్రేక్షకుల కట్టిపడేస్తోందట.. గుండెలను హత్తుకునేలా ఉందట. క్లైమాక్సే ఈ సినిమాకు హైలెట్‌గా నిలుస్తుందంటున్నారు. నేచురల్ స్టార్ నాని తనదైన శైలి యాక్టింగ్‌తో మరోసారి ఆకట్టుకోగా.. హీరోయిన్ ప్రియాంక, ఇతర నటులు తమ పాత్రలకు న్యాయం చేశారని.. వెన్నెల కిషోర్ కామెడీ నవ్వించడంతో పాటు.. మ్యూజిక్ డైరెక్టర్ అనిరుథ్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఆకట్టుకుందని.. ఒక రొమాన్స్ సినిమాలతో అదరొట్టిన కార్తికేయ.. నెగిటివ్ రోల్‌లో తన నటనతో ఆకట్టుకున్నారని.. మొత్తానికి కథ, కథనాలతో ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉందని ప్రీమియర్ షో చూసిన ప్రేక్షకులు తన అభిప్రాయాన్ని సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. ఎక్కడా ఎలాంటి కన్‌ఫ్యూజన్ లేకుండా దర్శకుడు విక్రమ్ కుమార్ సినిమాను తెరకెక్కించారట. విక్రమ్ చిత్రాలన్నింటిలో ఇదే అత్యంత సులభమైన చిత్రమని అంటున్నారు. ఫస్టాఫ్ మొత్తం కామెడీతో నడిపంచారట. ఎక్కడా బోర్ కొట్టకుండా చాలా డీసెంట్‌గా నడిచిందని ట్వీట్లు చేస్తున్నారు. ఫస్ట్ హాఫ్ బ్రిలియంట్ టూ గుడ్ అని.. సెకండ్ హాఫ్ కథ పరంగా బ్రిలియంట్ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.  ఇక కొందరు 5 పాయింట్లకు గాను 3.5 పాయింట్లు ఈ మూవీకి ఇస్తే... మరికొందరు 10కి గాను 7.5 ఇస్తున్నారు.. మొత్తానికి నాని హిట్ కొట్టారని చెబుతున్నారు.