గ్యాంగ్ లీడర్ టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్

గ్యాంగ్ లీడర్ టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్

నాని గ్యాంగ్ లీడర్ సినిమా ఆగష్టు 30వ తేదీన రిలీజ్ కావాల్సి ఉన్నది. అదే రోజున ప్రభాస్ సాహో రిలీజ్ అవుతుండటంతో గ్యాంగ్ లీడర్ వస్తుందా లేదంటే వాయిదా పడుతుందా అన్నది తెలియాలి.  సినిమా రిలీజ్ సంగతి పక్కనపెడితే.. ప్రమోషన్ షురూ చేసింది యూనిట్.  గ్యాంగ్ లీడర్ టీజర్ జులై 24 వ తేదీన ఉదయం 11 గంటలకు రిలీజ్ చేయాలని డిసైడ్ అయ్యారు.  దీనికి సంబంధించిన పోస్టర్ కూడా రిలీజ్ చేశారు.  

విక్రమ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది.  సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి.  ఒకవేళ సినిమా ఆగష్టు 30నే వచ్చే సాహసం చేస్తే అది ఆ సినిమా కలెక్షన్లపై ప్రభావం చూపుతుంది.  అందుతున్న సమాచారం ప్రకారం సెప్టెంబర్ 13వ తేదీన రిలీజ్ చేయాలని అనుకుంటున్నారని తెలుస్తోంది.