గ్యాంగ్ లీడర్ : నానిని అలా వాడేశారు..!!

గ్యాంగ్ లీడర్ :  నానిని అలా వాడేశారు..!!

నాని హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న గ్యాంగ్ లీడర్ సినిమా టీజర్ కొద్దిసేపటి క్రితమే రిలీజ్ అయ్యింది.  టీజర్ పై ఎన్నో అంచనాలు ఉన్నాయి.  విక్రమ్ కుమార్ ఈ టీజర్ కు కామెడీ ప్రధానంగా కట్ చేసినట్టు కనిపిస్తోంది.  నాని పెన్సిల్ పార్ధసారధిగా కనిపిస్తున్నారు.  రివెంజ్ రైటర్. 

ఓ రోజు ఓ ఐదుగురు ఇంటికి వస్తారు.  ఆ ఐదుగురితో చేతులు కలిపి నాని ఏం చేసారు అన్నది కథ. సినిమా దాదాపుగా నాని స్టైల్ లో కామెడీ ఎంటర్టైన్ గా తీర్చిదిద్దినట్టుగా కనిపిస్తోంది.  ఇందులో ఆర్ ఎక్స్ 100 మూవీ హీరో కార్తికేయ విలన్ గా కనిపిస్తున్నాడు.  ఈ విలన్ కు ఆ ఐదుగురికి సంబంధం ఏంటి.. నానిని వెతుక్కుంటూ ఎందుకు వచ్చారు అన్నది కథ.