కత్తులు, కర్రలతో బాసరలో దొంగల హల్‌చల్‌..

కత్తులు, కర్రలతో బాసరలో దొంగల హల్‌చల్‌..

ప్రముఖ పుణ్యక్షేత్రం జ్ఞాన సరస్వతి దేవాలయం సమీపంలోని బాసర రైల్వే స్టేషన్‌లో అర్ధరాత్రి దొంగల హల్‌చల్ చేశారు. కత్తులు, గొడ్డళ్లు, కర్రలు పట్టుకుకుని రైల్వేస్టేషన్‌లోని ప్రవేశించిన ముఠాను చూసి స్థానికులు, ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. స్థానికుల సమాచారంతో రైల్వేస్టేషన్‌కు చేరుకున్న పోలీసులు... ఆ ముఠాను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. వీళ్లు దొంగలా? లేక గ్యాంగ్ ల మధ్య గొడవతో ఓ గ్యాంగ్‌గా ఏర్పడి ఇలా కత్తులు, కర్రలతో వెళ్తున్నారా? అనే విషయంపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.