నయీం గ్యాంగ్ అరెస్ట్

నయీం గ్యాంగ్ అరెస్ట్

నయీం అనుచరుల భూకబ్జా వ్యవహారంలో రాచకొండ ఎస్ఓటి పోలీసులు ఐదుగిని అరెస్ట్ చేశారు. పాశం శ్రీను, అబ్దుల్ ఫహి, అబ్దుల్ నజీర్, హసీనా బేగం, తుమ్మ శ్రీనివాస్ లను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి దగ్గర నుండి 88 లక్షల రూపాయలను, మూడు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. నయీం బినామీ ఆస్తులు అయిన కమర్షియల్ కాంప్లెక్స్, ఖాళీ స్థలాలను వేరే వారి పేర్లపైన రిజిస్టర్ చేయడానికి ముఠా సభ్యులు ప్రయంత్నింస్తుండగా పోలీసులు వారిని అరెస్ట్ చేశారు.

సీపీ మహేశ్ భగవత్ మాట్లాడుతూ... నయీం చనిపోయిన తరువాత అతనికి చెందిన ఆస్తులను సీజ్ చేసాం. ఇప్పటికే ఆస్తులను సిట్ సీజ్ చేసింది. సీజ్ ప్రాపర్టీస్ ను ఎవరు పట్టించుకోవడం లేదని గుర్తించి అమ్మేందుకు యత్నించారు. భువనగిరిలో సర్వే నెంబర్ 730లోని 5 ఎకరాల భూమిని అమ్మేందుకు యత్నించారు. భువనగిరిలోని సబ్ రిజిస్ట్రార్ సహకరిస్తున్నట్లు తెలుస్తోంది. అతని పాత్రపై దర్యాప్తు చేస్తున్నాం అని సీపీ తెలిపారు. ఈ కేసులో ఎంతటి వారు ఉన్నా.. వారిని వదిలేది లేదని సీపీ హెచ్చరించారు.