గ్యాంగ్ స్టార్ హైదర్ ను అరెస్ట్ చేసిన హైదరాబాద్ పోలీసులు...

గ్యాంగ్ స్టార్ హైదర్ ను అరెస్ట్ చేసిన హైదరాబాద్ పోలీసులు...

గ్యాంగ్ స్టార్ హైదర్ ను అరెస్ట్ చేసారు హైదరాబాద్ నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు. గత వారం రోజులుగా ఒడిశా నుండి తప్పించుకుని హైదరాబాద్ లో తిరుగుతున్నాడు గ్యాంగ్ స్టార్. ఓ మర్డర్ కేస్ తో పాటు కిడ్నాప్ కేస్ లో మోస్ట్ వాంటెడ్ గా గ్యాంగ్ స్టార్ హైదర్ పోలీసుల లిస్ట్ లో ఉన్నాడు. అయితే వారం రోజుల క్రితం అనారోగ్య సమస్యతో హైదర్ ను కటక్ లో హాస్పిటల్ లో చికిత్స కోసం తీసుకొచ్చారు భువనేశ్వర్ పోలీసులు. కానీ హాస్పిటల్ నుండి పరారయ్యి హైదరాబాద్ కు మకాం మార్చాడు హైదర్. దాంతో అతని కోసం గత కొన్ని రోజులుగా గాలిస్తున్నారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. ఎట్టకేలకు హైదర్ ను హైదరాబాద్ లోనే పటుకున్న పోలీసులు... భువనేశ్వర్ పోలీసులకు సమాచారం ఇచ్చారు.