మోస్ట్‌ వాంటెడ్‌ మాఫియా డాన్‌ అరెస్ట్‌

మోస్ట్‌ వాంటెడ్‌ మాఫియా డాన్‌ అరెస్ట్‌

మోస్ట్‌ వాంటెడ్‌ మాఫియా డాన్‌ సంపత్‌ నెహ్రా పోలీసులకు పట్టుబడ్డాడు. హైదరాబాద్‌లోని మియాపూర్‌లో కొంతకాలంగా తలదాచుకున్నాడన్న పక్కా సమాచారంతో హర్యనా టాస్క్‌ ఫోర్స్‌ పోలీసులు ప్లాన్‌ ప్రకారం దాడి చేసి అతనిని అరెస్టు చేశారు. 28 ఏళ్ల సంపత్‌ నెహ్రాపై వివిధ రాష్ట్రాల్లో 45 కేసులున్నాయి. ఇతని స్వస్థలం రాజస్థాన్‌లోని రాజగఢ్‌. లెక్కలేనన్ని దారుణాలకు పాల్పడిన సంపత్‌.. హర్యానాలో మాఫియా డాన్‌గా ఎదిగాడు. లెక్కలేనన్ని దారుణాలకు పాల్పడ్డాడు. తన నేర సామ్రాజ్యాన్ని  పక్క రాష్ట్రాలైన పంజాబ్‌, రాజస్థాన్‌ రాష్ట్రాలకు విస్తరించాడు. షార్ప్‌ షూటర్‌గా పేరుపొందిన సంపత్‌.. దాదాపు 20 రోజుల క్రితం హైదరాబాద్‌కు పారిపోయి వచ్చాడు. సంపత్‌ను పట్టించిన వారికి రూ.2 లక్షలిస్తామని గతంలోనే హర్యానా, రాజస్థాన్‌, పంజాబ్‌ పోలీసులు ప్రకటించారు. సంపత్‌పై మూడు రాష్ట్రాల్లో దాదాపు 12 హత్య కేసులు, 6 హత్యాయత్నాలు,  పదుల సంఖ్యలో దోపిడీలు, బెదిరింపుల కేసులున్నాయి.