భారత ఆటగాళ్లకు క్వారంటైన్ రోజులు తగ్గించాలి... 

భారత ఆటగాళ్లకు క్వారంటైన్ రోజులు తగ్గించాలి... 

ఈ ఏడాది చివర్లో భారత జట్టు టెస్ట్ సిరీస్ కోసం ఆస్ట్రేలియా పర్యటనకు వేళ్తుంది అని స్పష్టం చేసాడు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ. కానీ అక్కడకు వచ్చిన ఆటగాళ్లకు క్వారంటైన్  రోజులు తగ్గించాలి అన్నాడు. కరోనా కారణంగా వచ్చిన విరామం తర్వాత ఆడుతున్న క్రికెట్ మ్యాచ్లలో కొన్ని కొత్త నియమాలను తీసుకొచ్చారు. అందులో ఒకటి ఆటగాళ్లు అందరూ 14 రోజుల క్వారంటైన్ లో ఉండాలి. ఆ తర్వాత వారికి నిర్విహించిన కరోనా పరీక్షలో నెగెటివ్ వస్తే వారిని ఆడటానికి అనుమతి ఇస్తారు. ఆ తరహాలో డిసెంబరలో ఆస్ట్రేలియాకు వెళ్లే భారత ఆటగాళ్లను తక్కువ రోజులే  క్వారంటైన్ లో ఉంచుతారని తాను అనుకుంటున్నట్లు  గంగూలీ అన్నారు. దాదా మాట్లాడుతూ... మనం చూసినట్లైతే ఆసీస్ లో ఒక మెల్బోర్న్ లో మినహా ఎక్కడ అంతగా కరోనా ప్రభావం లేదు. అందువల్ల ఆసీస్ పర్యటనకు వెళ్లిన మన ఆటగాళ్లను తక్కువ రోజులు ఉంచాలి. ఎందుకంటే... ఆటగాళ్లు అలా ఒకే స్థలంలో ఎటు కదలకుండా ఉంటె వారికి నిరాశ కలుగుతుంది. మ్యాచ్ కు ముందు అది అసలు మంచింది కాదు అని తెలిపారు.