కరోనా పై యుద్ధనికి బీసీసీఐ అధ్యక్షుడు విరాళం...

కరోనా పై యుద్ధనికి బీసీసీఐ అధ్యక్షుడు విరాళం...

కరోనా వైరస్ కారణంగా ప్రస్తుతం ప్రపంచం వణికిపోతుంది. కరోనా కారణంగా మరణాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. అయితే తెలంగాణలో కూడా ఈ వైరస్ వీర విహారం చేస్తుంది. అయితే ప్రస్తుతం మన దేశం లో కరోనా బాధితుల సంఖ్య 722కు చేరుకుంది. అలాగే కరోనా మరణాల సంఖ్య 14కు చేరింది. అయితే ఈ వైరస్ వేగంగా విస్తరిస్తుండటం తో భారత ప్రధాని నరేంద్ర మోదీ 21 రోజుల లాక్ డౌన్ విధించారు. అయితే ఈ వైరస్ ను ఎదుర్కోవడానికి సెలబ్రెటీలు, క్రికెటర్లు ఒక్కొక్కరిగా ముందుకు వస్తున్నారు. అయితే ఇప్పడు తాజాగా కరోనా బాధితులకు సహాయం చేయడానికి బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ముందుకు వచ్చారు. గంగూలీ రూ .50 లక్షల విలువైన బియ్యాన్ని నిరుపేదలకు విరాళంగా ఇస్తానని చేప్పారు. అలాగే ప్రజలు అందరూ ఈ 21 రోజులు ఇంటి నుండి బయటకు రాకూడదని వెల్లడించారు. అయితే కరోనా కారణంగా ఐపీఎల్ తో సహా బీసీసీఐ ఆధ్వర్యం లో జరిగే అని టోర్నీలు నిలిచిపోయిన విషయం అందరికి తెలిసందే.