భారత ఓటమి పై గంగూలీ స్పందన...

భారత ఓటమి పై గంగూలీ స్పందన...

యూఏఈ వేదిక గా జరిగిన ఐపీఎల్ 2020 ముగిసిన అనంతరం భారత జట్టు సుదీర్ఘ ఆస్ట్రేలియా పర్యటన కు వెళ్ళింది. అందులో భాగంగా ఈ రెండు జట్లు మొదట వన్డే సిరీస్ లో తలపడ్డాయి. మూడు మ్యాచ్ ల ఈ సిరీస్ ను ఆసీస్ 2-1 తో సొంతం చేసుకుంది. మొదటి రెండు మ్యాచ్ లలో ఆసీస్ విజయం సాధించగా చివరి మ్యాచ్ లో భారత్ గెలిచింది. అయితే మొదట బ్యాటింగ్ చేసిన టీం ఇండియా 152 పరుగులకే 5 వికెట్లు కోల్పోగా తర్వాత హార్దిక్, జడేజా ఇద్దరు  అర్ధశతకాలు సాధించి భారత విజయంలో కీలక పాత్ర పోషించారు. ఈ విజయం పై బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ మాట్లాడుతూ... సిరీస్ ఓడిపోయిన టీం ఇండియాకు చివర్లో మంచి విజయం దక్కింది అన్నాడు. అలాగే పాండ్యా, జడేజా త్వరలోనే భారత జట్టుకు ముఖ్యమైన ఆటగాళ్లుగా అవతరిస్తారు అని తెలిపాడు. అయితే ఈ రేడు జట్ల మధ్య శుక్రవారం నుండి మూడు మ్యాచ్ ల టీ20 సిరీస్ ప్రారంభం కానుంది.