కరోనా పై ఐసీసీ అత్యవసర సమావేశం... హాజరైన గంగూలీ

కరోనా పై ఐసీసీ అత్యవసర సమావేశం... హాజరైన గంగూలీ

కరోనా వైరస్ కారణంగా అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) బోర్డు ఈ రోజు టెలికాన్ఫరెన్స్ ద్వారా సమావేశమైంది. ప్రపంచవ్యాప్తంగా క్రీడల పై కరోనా మహమ్మారి ప్రభావం చర్చించబడింది. ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ''మను సాహ్నీ''  మాట్లాడుతూ... మేము సమగ్రమైన వ్యాపార కొనసాగింపు మరియు ఆకస్మిక ప్రణాళిక వ్యాయామాన్ని కొనసాగిస్తున్నాము, అయితే ఐసీసీ నిర్వహణ ఐసీసీ సంఘటనల చుట్టూ మా ఆకస్మిక ప్రణాళికను కొనసాగిస్తుంది అని అన్నారు. ఐసీసీ సమావేశం లో బీసీసీఐ ప్రతినిధిగా సౌరవ్ గంగూలీ పాల్గొన్నారు. అయితే ఐసీసీ ఉమెన్స్ టి 20 ప్రపంచ కప్ 2020 ను నిర్వహించడానికి గంగూలీ చేసిన కృషికి క్రికెట్ ఆస్ట్రేలియా మరియు స్థానిక ఆర్గనైజింగ్ కమిటీ కృతజ్ఞతలు తెలిపాయి.

అయితే స్వదేశంలో పాకిస్తాన్, వెస్టిండీస్‌లకు ఆతిథ్యం ఇవ్వాల్సిన ఇంగ్లాండ్ అలా చేయలేకపోతే ఏమి జరుగుతుందో అని ఓ బోర్డు సభ్యుడిని అడిగినప్పుడు, పాయింట్ల కేటాయింపు విషయాన్ని సాంకేతిక కమిటీకి సూచిస్తామని చెప్పారు. అయితే భారత్ ఇప్పటికే ఆరు సిరీస్‌లు ఆడి అగ్రస్థానంలో ఉంది. అయితే లాక్‌డౌన్ కారణంగా ఇంగ్లాండ్ మూడు సిరీస్లు ఆడవచ్చు. అయితే అక్టోబరు లో ఆస్ట్రేలియాలో  జరగాల్సిన పురుషుల  టీ20 ప్రపంచ కప్ కు ముప్పు లేదని అప్పటివరకు పరిస్థితులు అదుపులోకి వస్తాయి అని బోర్డు సభ్యులు అభిప్రాయపడ్డారు.