ఈ దాదానే రేపటి సీఎం

ఈ దాదానే రేపటి సీఎం

భారత జట్టును విజయాల బాట పట్టించిన కెప్టెన్లలో సౌరవ్ గంగూలీ ముందు వరుసలో ఉంటాడు... సొంతగడ్డపైనే కాకుండా విదేశాల్లోనూ టీమిండియాకు విజయాల రుచి చూపించిన దాదా... ఏకంగా చొక్కా విప్పి ఓ విదేశీ గడ్డపై తిప్పాడంటే దాదా డేర్‌ ఏంటో అర్థం చేసుకోవచ్చు. బలమైన జట్టును ఎన్నికోవడంలోనూ తన ప్రత్యేకతను చాటాడు... వీరేంద్ర సెహ్వాగ్, యువరాజ్ సింగ్, ఎంఎస్ ధోనీ, హర్భజన్ సింగ్... ఇలా ఒక్కరేంటి... ఎందరో క్రికెటర్లను రాటుదేల్చాడు. అయితే దాదా... ఏదో ఒక రోజు బీసీసీఐ చీఫ్ అవుతాడని... ఆ తర్వాత వెస్ట్ బెంగాల్ సీఎం కూడా అవుతాడంటూ జోస్యం చెప్పాడు దాదా వీరాభిమాని వీరేంద్ర సెహ్వాగ్. 

దాదా ఆత్మకథ ‘ఎ సెంచరీ ఈజ్ నాట్ ఎనఫ్’ పుస్కకావిష్కరణ కార్యక్రమంలో యువరాజ్ సింగ్‌తో కలిసి పాల్గొన్న వీరూ... గంగూలీపై ప్రశంసల వర్షం కురిపించాడు... తమ క్రికెట్ కెరీర్‌ను దాదా తీర్చిదిద్దాడంటూ గతాన్ని గుర్తు చేసుకున్న వీరూ... బీసీసీఐ అధ్యక్ష పదవి పోటీలో గంగూలీ ఉన్నాడన్న వార్తలపై స్పందిస్తూ... బీసీసీఐ అధ్యక్షుడేంటి దాదా ఏకంగా బెంగాల్ ముఖ్యమంత్రే అవుతారని పేర్కొన్నారు... సీఎం కాక ముందే బీసీసీఐ అధ్యక్ష పదవిని కూడా ఆయన చేపడతారని తెలిపారు సెహ్వాగ్. ఇక యువరాజ్ మాట్లాడుతూ నాలోని ఫీల్డర్‌ని, జట్టుకు విజయాన్ని అందించే నా సత్తాను దాదాయే గుర్తించారని వెల్లడించాడు. ఈ సందర్భంగా గంగూలీ మాట్లాడుతూ అలనాటి పరిస్థితులను యువరాజ్, సెహ్వాగ్, భజ్జీపై తాను పెట్టుకున్న నమ్మకాన్ని... వారు నిరూపించుకున్న విధానాన్ని చెప్పుకొచ్చారు. మరి క్రికెట్‌లో తనకంటూ ప్రత్యేకతను చాటుకున్న దాదా... మరి రాజకీయాలవైపు అడుగులు వేస్తాడేమో! వేచి చూడాలి.