మయాంక్ నిన్ను జట్టులోకి తీసుకోను : బీసీసీఐ అధ్యక్షుడు  

  మయాంక్ నిన్ను జట్టులోకి తీసుకోను : బీసీసీఐ అధ్యక్షుడు  

భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ మయాంక్ షోలో పాల్గొన విషయం తెలిసిందే. అయితే అందులో ఈ యువ ఓపెనర్ కు షాక్ ఇచ్చాడు దాదా.  ప్రస్తుత ఇండియన్ టెస్ట్ జట్టు నుండి 5 మంది ఆటగాళ్లను  జట్టులోకి ఎన్నుకోవాలని మయాంక్ గంగూలీని కోరాడు. దానికి దాదా సమాధానం ఇస్తూ... "ఇది చాలా కఠినమైన ప్రశ్న, ఎందుకంటే ప్రతి తరం ఆటగాళ్ళు భిన్నంగా ఉన్నారని నేను భావిస్తున్నాను. ఆటగాళ్ళు వేర్వేరు తరాలలో  వేర్వేరు సవాళ్లను ఎదుర్కొంటారు. ఇక ప్రస్తుత జట్టు నుండి విరాట్ కోహ్లీ మరియు రోహిత్ శర్మలను మొదట తీసుకుంటాను. అయితే కోహ్లీ ఇప్పుడు కెప్టెన్ అయిన నా జట్టులో ఉండటానికి ఇష్టపడతాడు. ఇక తర్వాత ''నేను నిన్ను నా జట్టులోకి తీసుకోను మయాంక్ అని అతనికి నేరుగా చెప్పి షాక్ ఇచ్చాడు. దానికి వివరణ ఇస్తూ... ఎందుకంటే నాకు రోహిత్ తో పాటుగా మరొక చివరలో వీరేందర్ సెహ్వాగ్ ఉన్నాడు. కాబట్టి నువ్వు నా 3 వ ఓపెనర్. అలాగే మరొక వైపు నాకు జహీర్ ఉన్నందున బుమ్రా కావాలి. ఇక జవగల్ శ్రీనాథ్ పదవీ విరమణ చేసిన తరువాత నేను మొహమ్మద్ షమీని నా జట్టులోకి  తీసుకుంటాను. చివరగా నా వైపు హర్భజన్ మరియు అనిల్ కుంబ్లే ఉన్నారు కాబట్టి అశ్విన్ నా మూడవ స్పిన్నర్ అని తెలిపాడు.