హైదరాబాద్‌లో గంజాయి లిక్విడ్‌ దందా..

హైదరాబాద్‌లో గంజాయి లిక్విడ్‌ దందా..

గంజాయి దందా కొత్తపుంతలు తొక్కుతోంది... హైదరాబాద్‌లో బయటపడిన కొత్త రకం గంజాయి దందాను చూసి పోలీసులు నోరువెల్లబెట్టారు. గంజాయిని లిక్విడ్ రూపంలో తీసుకువచ్చి విక్రయిస్తున్న ముఠా గుట్టురట్టుచేశారు పోలీసులు. బిరియాని ఫుడ్ కలర్స్‌లో తేనే బాటిళ్లలో లిక్విడ్ ను తీసుకువచ్చి గంజాయి లిక్విడ్‌ని విక్రయిస్తున్నట్టు గుర్తించారు. హైదరాబాద్ కేంద్రంగా నడుస్తున్న లిక్విడ్ గంజాయిని ముఠాను విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. విశాఖపట్నం నుంచి లిక్విడ్ గంజాయిని తీసుకుని వచ్చి హైదరాబాద్‌లో చిన్న చిన్న బాటిళ్లలో నింపి సరఫరా చేస్తోంది ఈ ముఠా. ఇక బెంగళూరులోనూ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు, విద్యార్థులను టార్గెట్‌గా చేసి విక్రయాలు జరుపుతున్నట్టు తేల్చారు. ఈ కేసులో ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌తో పాటు మరో ఇద్దరిని అరెస్ట్ చేసింది విజిలెన్స్ అధికారులు.